తెలుగు మీడియం రద్దును ఉపసంహరించుకోవాలి

తూర్పుగోదావరి జిల్లా: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌పరం చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కంకణం కట్టుకుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. మున్సిపల్‌ స్కూల్‌ తెలుగు మీడియం రద్దును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తుని పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు ఎమ్మెల్యే దాడిశెట్టి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మంత్రులు నారాయణ, గంటాలు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. నిరుపేద విద్యార్థులను చంద్రబాబు చదువుకు దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top