మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

ఉరుటూరు(వీరపునాయునిపల్లె)మండల పరిధిలోని ఉరుటూరు గ్రామానికి చెందిన వైయస్సార్‌సీపీ నాయకుడు వెంకట్రామిరెడ్డి సోదరుడు వెంకటచలమారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించాడు. ఆసమయంలో అందుబాటులో లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే సోమవారం ఉరుటూరు గ్రామానికి ఇచ్చి మృతుని కుటుంబసభ్యులను పరామర్శించారు. దైర్యంగా ఉండాలని సూచించారు. అన్ని వేళలా కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. జెన్‌కో అధికారులతో మాట్లాడారు. అదే విధంగా వైయస్సార్‌సీపీ నాయకుడు గంగిరెడ్డి చిన్నాన్న కల్లూరు రాజారెడ్డి పక్షపాతంతో భాదపడుతుండగా ఆయనను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ రగునాథరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిమ్మకాయల సుధాకరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరప్రతాపరెడ్డి, గంగిరెడ్డిపల్లె ఎంపీటీసీ రవి, సర్పంచులు ప్రతాప్, మాజీ సర్పంచులు వాసుదేవరెడ్డి, శివ, ఉత్తమారెడ్డి, నాయకులు తురకపల్లె రాజశేఖరరెడ్డి, బాస్కరరెడ్డి, శివరామిరెడ్డి తదితరులు సాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top