ఎర్రచందనం ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలించిన చెవిరెడ్డి

చంద్రగిరి: చిత్తూరు జిల్లా శ్రీవారి మెట్టు సమీపంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్ జరి గిన ప్రాంతాన్ని మంగళవారం క్షుణ్ణంగా పరిశీలించారు. కూలీల మృతదేహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఎన్‌కౌంటర్ జరిగినతీరు అనుమానాస్పదంగా ఉందన్నారు.

పరిస్థితి చూస్తుంటే కూలీలను తీసుకువచ్చి చంపి, ఎన్‌కౌం టర్‌గా చిత్రీకరించినట్టు అందరితోపాటు తనకూ అనుమా నం వస్తోందని చెప్పారు. ప్రకృతి సంపదను కొల్లగొట్టే బడాస్మగ్లర్లు ఏ పార్టీ వారైనా, ఏ రాష్ట్రం వారైనా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటే, కూలీలు అటవీ ప్రాంతంలోకి వచ్చే పరిస్థితి ఉండదన్నారు.  
Back to Top