క్షీణిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోగ్యం

  •  డంపింగ్ యార్డు తొలగించేవరకు దీక్ష విరమించేది లేదన్న చెవిరెడ్డి
  • పడిపోతున్న బీపీ, షుగర్
  • ఆరోగ్యం మరింత క్షీణిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదముందన్న వైద్యులు
  • ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెవిరెడ్డికి ఫోన్ లో పరామర్శించిన అధినేత
 తిరుపతి:  చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వేలాది మంది ప్రజల ఆరోగ్యలకు ముప్పుగా మారిన డంపింగ్‌ యార్డును తరలించాలని దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుంది. దీక్ష  ఐదో రోజుకు చేరింది. మూడు రోజులుగా చిత్తూరు సబ్‌జైలులో దీక్ష చేసిన ఆయన అక్కడ నుంచి బెయిల్‌పై విడుదల అయ్యాక తిరుపతి రూరల్‌ మండలం కేసీపేటలో దీక్షను కొనసాగిస్తున్నారు. డంపింగ్ యార్డును తొలగించేవరకు దీక్షను విరమించేది లేదని చెవిరెడ్డి బీష్మించారు. చెవిరెడ్డిని అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. 
 
నాలుగు రోజులుగా ఎమ్మెల్యే ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్రమేణ క్షిణిస్తుంది. బుధవారం రాత్రి దీక్ష శిబిరంలో ప్రభుత్వ వైద్యులు కాజల్‌ ఆనంద్‌ ఎమ్మెల్యేకు పరీక్షలు నిర్వహించారు. బీపీ 106/67కు, షుగర్‌ లెవల్‌ 79కి పడిపోయినట్లు గుర్తించారు. దీక్ష ఇలాగే కొనసాగిస్తే ఆరోగ్యం మరింత క్షిణించే ప్రమాదం ఉందని, కోమాలోకి పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. అంతకు ముందు ఎమ్మెల్యేకు ఆయన వ్యక్తిగత వైద్యులు హరినాథ్‌రెడ్డి, కృష్ణప్రశాంతి వైద్య పరీక్షలు చేశారు. 
Back to Top