రోడ్డుపైనే కాల్చి చంపేయండి: ఎమ్మెల్యే చెవిరెడ్డి

 చిత్తూరు : చిత్తూరు జిల్లా జైలులో అక్రమ
నిర్భంధంలో ఉన్న భాస్కర్‌రెడ్డి  బెయిల్‌పై విడుదలయ్యారు. మూడు రోజులుగా మూడు
కేసుల్లో ఇరికించి ఎమ్మెల్యేను వేధించి చిత్తూరు పోలీసులు పచ్చి తెలుగుదేశం
కార్యకర్తలు అనిపించుకొన్నారు. మొదట అధికారులు విధులు అడ్డుకొన్నారని, తర్వాత
2013లో కోడ్ ఉల్లంఘించారని, తర్వాత సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర వాచ్ మన్ ను
అడ్డుకొన్నారని కేసులు పెట్టారు. చివరకు  ఆయనను కడప కేంద్ర కారాగారానికి రిమాండ్‌కు
తరలించారు. అక్కడ నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ
వైఖరిపై తీవ్రంగా ధ్వజమెత్తారు.  ‘‘ప్రజల తరుఫున పోరాటం చేస్తే అరెస్టులా? జనం సమస్యలు ప్రశ్నిస్తే నిర్భంధమా? అధికార దుర్వినియోగం సరికాదంటే అణచి వేస్తారా? దివంగత సీఎం వైఎస్సార్ వారసులుగా, జగనన్న సైనికులుగా ప్రభుత్వ వైఫల్యాలలను
ఎండగడుతూనే ఉంటాం. కేసుల్లో అక్రమంగా ఇరికించి జైలు పాలు చేయడం తప్ప ఇంకేం చేయగలరు? ఏం చంపుతారా? రోడ్డుపైనే కాల్చి చంపేయండి’’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి
భాస్కర్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.  

 

తాజా వీడియోలు

Back to Top