కదిరి ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చాంద్ బాషా

అనంతపురంః కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అత్యంత కీలకమైన రథోత్సవం అసంఖ్యాక భక్త జనం నడుమ  సాగింది. స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  రథోత్సవాన్ని చూసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 3 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. పట్టణ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి.

Back to Top