ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండేందుకే జ‌గ‌న‌న్న వ‌చ్చారు



బేతంచర్ల:  మానవరూపంలో ఉన్న దేవుడు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిని దేవుడు హఠాత్తుగా తీసుకెళ్లడంతో ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండేందుకు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముందుకు వ‌చ్చార‌ని డోన్ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి అన్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా మంగ‌ళ‌వారం బేతంచ‌ర్ల ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికీ అవినీతిని అలవాటు చేశాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డోన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. జన్మభూమి కమిటీలు పెట్టి పెన్షన్‌ ఇవ్వాలన్నా లంచం.. ఇల్లు కావాలన్నా లంచం వసూలు చేయిస్తున్నాడని ఆరోపించారు. డోన్‌ నియోజకవర్గ పరిధిలోని బేతంచర్ల బస్టాండ్‌ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బుగ్గన మాట్లాడుతూ.. పేద విద్యార్థులను డాక్టర్లను, ఇంజినీర్లుగా తయారు చేసిన ఘనత దివంగత మహానేత వైయస్‌ఆర్‌దన్నారు. పేదవారికి ఇళ్లు కట్టించి, రైతులకు గిట్టుబాట ధర కల్పించి, ఉచిత విద్యుత్‌ వంటి సౌకర్యాలు చేగూర్చారని గుర్తు చేశారు.  కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కుమ్మకై తప్పుడు కేసులు బనాయించారో అందరికీ తెలుసన్నారు. 
2014 ఎన్నికల్లో లేనిపోని హామీలు కుమ్మరించిన చంద్రబాబు ఒక్క శాతం ఓట్లతో గెలిచారన్నారు. నాలుగు సంవత్సరాల్లో ఒక్క వాగ్ధానానైనా నెరవేర్చాడా అని బుగ్గన ప్రజలను అడిగారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షనేత వైపు సామాన్య మానవుడు చూస్తున్నాడన్నారు. ప్రజల దగ్గరకు వెళ్లి ప్రజలకు ధైర్యం చెబుతామని వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తుంటే ఎందుకు మీకు భయం అని చంద్రబాబు పార్టీని ప్రశ్నించారు. 
కన్నతల్లి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఒక్కగానొక్క కొడుకు మూడు వేల కిలోమీటర్లు తిరుగుతుంటే భయపడాల్సింది ఆమె..కానీ ఆమే వీర తిలకం దిద్దిపంపితే మీకెందుకు అంత భయం అని నిలదీశారు.  
రాష్ట్ర ప్రయోజనాలను మంటగలిపి.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. అమరావతి అని చెప్పి బొమ్మలు చూపిస్తున్నారని బుగ్గన విరుచుకుపడ్డారు. ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులన్నీ వైయస్‌ఆర్‌ మొదలు పెడితే ఈ రోజుకు పదిశాతం కూడా పూర్తి చేయలేదన్నారు. చంద్రబాబు ఆయన కోటరీకి వైయస్‌ జగన్‌ అంటే భయమని బుగ్గన ఎద్దేవా చేశారు.  
డోన్‌ నియోజకవర్గం సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పైలెట్‌ బేసెస్‌గా రాయల కాలం చెరువులన్నింటికీ మరమ్ములు చేసి నీరు అందించాలని బుగ్గన వైయస్‌ జగన్‌ను కోరారు. అదే విధంగా తాగునీటి సమస్యను రూపుమాపాలన్నారు. డోన్‌లో మైనింగ్‌ కాలేజీ, ఆస్పత్రి స్థాపించాలని కోరారు. 

తాజా వీడియోలు

Back to Top