ప్రభుత్వ పథకాల మంజూరులో ప‌చ్చ నేత‌ల పెత్తనం

 
 


క‌ర్నూలు:  ప్ర‌భుత్వ ప‌థ‌కాల మంజూరులో ప‌చ్చ నేత‌ల పెత్త‌నం అధిక‌మైంద‌ని పీఏసీ చైర్మన్‌ డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమ‌ర్శించారు. సీఎం చంద్రబాబు స్థానిక ప్రజా ప్రతినిధులను పక్కనబెట్టి జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి వారి ద్వారా ప్రజా ధనాన్ని లూటీ చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీపీ గజ్జి కిట్టమ్మ, గ్రామ సర్పంచ్‌ బొద్దుల రోజమ్మ ఆధ్వర్యంలో  వివిధ శాఖల మండల అధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దేశంలో ఎక్కడా లేని విధంగా  ఏపీలో  స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.   రేషన్‌ కార్డు,  పింఛన్, ఇల్లు, రుణం మంజూరు కావలంటే  జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. 

Back to Top