వైయస్‌ఆర్‌ చేసిన మేలు మరిచిపోలేం


చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన మేలును ముస్లింలు మరిచిపోరని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంజాద్‌బాషా అన్నారు. శనివారం కల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మైనారిటీ సదస్సులో ఆయన మాట్లాడుతూ..మహానేత పాలనలోనే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని, పిల్లలను ఇంజినీరింగ్, డాక్టర్‌ చదువులు చదివించారని గుర్తు చేశారు. ముస్లిం మైనారిటీలు అంటే విశ్వాసానికి మారుపేరు అని అంజాద్‌బాషా అన్నారు. కీడు చేసిన వ్యక్తిని కూడా మరిచిపోమన్నారు. బడ్జెట్‌లో మాత్రమే కేటాయిస్తున్నారని, వాటిని టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదన్నారు. వైయస్‌ జగన  ముఖ్యమంత్రి అయిన తరువాత రూ.2 వేల కోట్లతో బడ్జెట్‌ కేటాయించి ప్రత్యేక కార్పోరేషన్‌ఏర్పాటు చేయాలని  అంజాద్‌బాషా కోరారు. 

 

తాజా ఫోటోలు

Back to Top