సమైక్య ఆందోళనకు అమరనాథ్ రెడ్డి మద్దతు

రాజంపేట 08 ఆగస్టు 2013:

హైదరాబాద్‌ సమైక్యాంధ్రులదేనని వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్కు పుట్టగతులుండవని  హెచ్చరించారు. వైయస్‌ఆర్‌ జిల్లా రాజంపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలు చేస్తున్న జేఏసీ నాయకులకు ఆయన మద్దతు తెలిపారు. రాష్ట్ర విభజనకు నిరసనగా రాజంపేటలో మున్సిపల్‌ కార్మికులు ఉపాధ్యాయులు, అంగన్‌వాడి మహిళలు ఐక్య కళాకారుల యూనియన్‌ ధర్నా, ర్యాలీ నిర్వహించారు. కడపలో బైక్‌ ర్యాలీ చేసేందుకు యత్నించిన సమైక్యాంధ్ర జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు కోటిరెడ్డి సర్కిల్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లాల్లో పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

తాజా ఫోటోలు

Back to Top