బాబు ఒక సామాజిక, ఆర్థిక నేరగాడు

ఓట్లు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ
ఆయన పక్కనుండే వారంతా ఆర్థిక నేరగాళ్లే
నాలుగేళ్లలో అడ్డంగా సంపాదించింది సుమారు రూ. 5 లక్షల కోట్లు!
నేను బాగుంటే చాలనుకునే పనికిమాలిన వ్యక్తి 
హోదా రావాలనే తపనతో వైయస్‌ జగన్‌ రెండుసార్లు మద్దతిచ్చారు 
అసెంబ్లీ తీర్మానాలు ఢిల్లీకి పంపిఉంటే వారికి బాధ తెలిసేది
తన స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టాడు
విజయవాడ: చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక సామాజిక నేరగాడు.. ఒక వెన్నుపోటు దారుడని, ఇవన్నీ రాష్ట్రం చూసిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయి.. ఇవాల్టికి మనవాళ్లు బ్రీఫ్డ్‌మీ వాయిస్‌నాది కాదని చెప్పలేకపోయిన వ్యక్తి చంద్రబాబు అని ఆర్కే ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ సీపీ నేతలను ఆర్థిక నేరగాళ్లు అని చంద్రబాబు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు చుట్టూ ఉండే వారంతా ఆర్థిక నేరగాళ్లని సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావు, రాయపాటి సాంబశివరావు వీరంతా బ్యాంక్‌లకు డబ్బులు ఎగ్గొట్టిన ఆర్థిక నేరగాళ్లు అన్నారు. రాష్ట్రాన్ని సర్వస్వం దోచేసిన చంద్రబాబు అతిపెద్ద ఆర్థిక నేరగాడన్నారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆర్కే విలేకరుల సమావేశం నిర్వహించారు. 
నాలుగేళ్లుగా సర్వస్వం దోచేశారు..
నాలుగేళ్లుగా పట్టిసీమ, పోలవరం, రాజధాని నిర్మాణం, మట్టి, ఇసుక దోచుకొని చంద్రబాబు సుమారు రూ. 5 లక్షల కోట్లు సంపాదించారని ఆర్కే విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు.. అక్రమ సంపాదనే ముఖ్యం... నా కొడుకు నేను బాగుంటే చాలు అనుకునే పనికిమాలిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. 
రాష్ట్ర ప్రజల భవిష్యత్తే తన భవిష్యత్తుగా...
ప్రత్యేక హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు దీక్షలు, ధర్నాలు చేసిన ఏకైక వ్యక్తి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ అని ఎమ్మెల్యే ఆర్కే గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల సంజీవని అని పోరాటాలు చేస్తూ ప్రజలకు అండగా నిలబడిందన్నారు. అక్రమంగా విభజించబడిన ఏపీకి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన వారు మాట నిలబెట్టుకోవాలని వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాట్నర్‌ పవన్‌ కల్యాణ్‌ అవిశ్వాసం పెట్టండి అని చెప్పగానే వైయస్‌ జగన్‌ తీర్మానం పెట్టారని, అదే విధంగా ‘మేము అవిశ్వాసం పెడితే.. మీరు మద్దతు ఇవ్వండి.. మీరు పెడితే మేము మద్దతు ఇస్తాం’ అని వైయస్‌జగన్‌ చెప్పారన్నారు. ఆ మాట టీడీపీ మర్చిపోవద్దన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్న వైయస్‌ జగన్‌.. చంద్రబాబు దొంగ అని తెలిసినా అసెంబ్లీలో టీడీపీ పెట్టిన తీర్మానికి రెండు సార్లు సభ్యులందరితో సంతకాలు చేయించి మద్దతు ఇచ్చారన్నారు. ప్రత్యేక హోదా  రావాలనే తపనతో బాబు ఎంత దొంగైనా.. ఎంత పనికిమాలినోడైనా ఆ రోజు మద్దతు ఇచ్చారన్నారు. తీర్మానాలు చేయించిన కాగితాలు కేంద్రానికి పంపించివుంటే ఏపీ ప్రజల బాధ వారికి తెలిసేదని, ఆ కాగితాలు ఉన్నాయా..? లేక స్పీకర్‌తో చింపించి పడేశావా? అని నిలదీశారు. 
అక్రమ కేసులని కోర్టులు తేల్చుతున్నాయి..
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై పెట్టినవన్నీ అక్రమ కేసులని గౌరవ న్యాయస్థానాలు, ట్రిబ్యునల్స్‌ అని ఒక్కొక్కటి కొట్టేస్తున్నాయని ఆర్కే స్పష్టం చేశారు. ఆర్థిక నేరగాళ్లు చంద్రబాబు చుట్టూ ఉన్నారన్నారు. బాబు పక్కనే ఉండే సుజనా చౌదరి మరిషస్‌ దేశ బ్యాంక్‌ నుంచి వేల కోట్లు అప్పు తీసుకొని ఎగనామం పెట్టాడన్నారు. అదే విధంగా రాయపాటి సాంబశివరావు ప్రజలు బ్యాంక్‌లలో దాచుకున్న సొత్తును అప్పుగా తీసుకొని ఎగొట్టాడన్నారు. అదే విధంగా గంటా శ్రీనివాసరావు బ్యాంక్‌ల్లో రుణం తీసుకొని ఎగ్గొట్టిన వ్యక్తి ఇలాంటి వారందరినీ చంద్రబాబు పక్కనబెట్టుకున్నాడన్నారు. 
 
Back to Top