బలవంతపు భూసేకరణ ఆపేయాలి

హైదరాబాద్‌: రాజధాని నిర్మాణానికి చంద్రబాబు బలవంతంగా భూసేకరణ చేపడుతున్నారని మంగళగిరి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు కోర్టును ఆశ్రయించారు. తమకు ఇష్టం లేకపోయినా బలవంతంగా భూసేకరణ చేపడుతున్నారని న్యాయస్థానానికి వివరించారు. ఉత్తర్వులు వచ్చే వరకు ప్రభుత్వ భూసేకరణను ఆపేయాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 
Back to Top