రాష్ట్ర వనరులను దోచుకునే పనిలో టీడీపీ

విశాఖపట్నం: ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు చేశారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రం కోసం ఒకవైపు వైయస్‌ జగన్‌ ఉద్యమాలు చేస్తుంటే.. చంద్రబాబు, ఆయన కొడుకు, మంత్రులు రాష్ట్ర వనరులను దోచుకునే పనిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వంచన వ్యతిరేక దీక్షలో ఎమ్మెల్యే ఆర్కే పాల్గొని మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా హోదా తీసుకురావాలని రెండు సార్లు ఏకగ్రీవ తీర్మానాలు చేసి వాటిని కేంద్రానికి పంపించలేని దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు. హోదా కోసం పోరాడే నాయకులపై అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమ కారులపై కేసులు పెడుతూ.. ఏ మొహం పెట్టుకొని ధర్మపోరాటం చేస్తున్నావని ప్రశ్నించారు. ఇకనైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకొని వైయస్‌ జగన్‌ దారిలో నడిచి హోదా సాధనకు కలిసి రావాలని సూచించారు. 
Back to Top