ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ వైఫల్యం

విజయవాడ: నాలుగేళ్ల టీడీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ వైఫ్యలం చెందిందని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్లు అభివృద్ధి చెందలేదన్నారు. దళితుల సమస్యలపై ఏప్రిల్‌ 2న ప్రధాని, రాష్ట్రపతికి వైయస్‌ జగన్‌ లేఖలు రాశారన్నారు. దళిత రాష్ట్రపతిని సంప్రదించే భాగంగా వైయస్‌ జగన్‌ పాదాభివందనం చేశారన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు హేళనగా మాట్లాడారన్నారు. దళితులకు శుభ్రత తెలియదని మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారన్నారు. మంత్రిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 
 
Back to Top