కేసుల కోసం కేంద్రానికి సాగిపడుతున్న బాబు

ఢిల్లీ: ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబుకు కేంద్రానికి సాగిలపడుతున్నారని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారని చెప్పారు. అన్ని మీడియా చానల్స్‌ కూడా ప్రత్యేక హోదా నినాదాన్ని వినిపిస్తున్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నా కూడా వైయస్‌ జగన్‌ ఒక్కరే పోరాటం చేస్తూ సంజీవంగా ఉంచారన్నారు. యువతకు అవగాహన కల్పించిన ఘనత వైయస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. చంద్రబాబు యువభేరిలో పాల్గొన్న పిల్లలను, హోదా ఉద్యమంలో పాల్గొంటే జైలుకు పంపిస్తామని హెచ్చరించారన్నారు. చంద్రబాబు హోదా విషయంలో చంద్రబాబు ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని నిలదీశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని నిలదీశారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయారని, అందుకే కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ పోరాటానికి వెనుకాడదని చెప్పారు. 
    
 
Back to Top