హైదరాబాద్) ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని, ఇందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉందా అని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కు సంబంధించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాసిన లేఖ కు కేంద్రం నుంచి ప్రత్యుత్తరం వచ్చిందని వెల్లడించారు. ప్రధానమంత్రి తరపున కేంద్ర ఉప కార్యదర్శి ఆసిన్ దత్త రాసిన లేఖను ఆయన చదివి వినిపించారు. ఇప్పట్లో ప్రత్యేక హోదా ఇచ్చే దాఖలాలు కనిపించటం లేదని లేఖలో పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. దీని పై పోరాడేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని, తెలుగుదేశం పార్టీ ఈ పోరాటానికి సిద్ధమా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.