సెక్యూరిటీ లేకుండా డ్వాక్రా మహిళల మధ్యకు రండి: మిధున్ రెడ్డి

ఎడాదికాలంగా ఎన్నో అవినీతి కుంభకోణాలకు పాల్పడిన చంద్రబాబు నాయుడు అవినీతిని నిర్మూలిస్తానంటూ ప్రతిజ్ఞలు చేయించడం హాస్యాస్పదంగా ఉందంటూ జనం నవ్వుకుంటున్నారు. పట్టిసీమలో అవినీతి ఏరులుగా పారింది. చంద్రన్న కానుక పేరుతో ప్రజల కిచ్చిన రేషన్ సరుకుల విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డారు. సొంత సంస్థ అయిన హెరిటేజ్ నుంచి నాసిరకం నెయ్యిని అధిక ధరకు సరఫరా చేయడం అవినీతి కాదా అని జనం అడుగుతున్నారు. చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. వెన్నుపోటు లేని రాజకీయాలను అందిస్తానని చంద్రబాబు చెబుతున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం వెన్నుపోటుతోనే ప్రారంభమయ్యింది. సొంతమామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు. తాను నిప్పులాంటి మనిషినని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. రైతురుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీలన్నీ ఎగ్గొట్టిన వ్యక్తి చంద్రబాబు. సెక్యూరిటీ లేకుండా డ్వాక్రా మహిళల మధ్యకు వచ్చి చూడండి చంద్రబాబు గారూ.. నిప్పును ఆర్పేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు.
Back to Top