వేధింపులు ఆపకపోతే....!

అనంతపురం: ప్రతిపక్షనేత, తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు భయపడుతున్నారని రాజంపేట ఎంపి పి. మిథున్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ నేతలను హెచ్చరించారు. జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ....శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమను నేతలను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

ఇటీవల బెళుగుప్పలో సూరయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈక్రమంలోనే ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలనుతు  వ్యతిరేకంగా అనంతపురం జిల్లా బెళుగుప్పలో ... వైఎస్సార్సీపీ ధర్నాకు పిలుపునిచ్చింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి దీక్షను భగ్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 

మంగళవారం అర్థరాత్రి నుంచే పట్టణంలో 144 సెక్షన్ విధించడంతో పాటు 25మంది వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేశారు. ధర్నా కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని తొలగించారు. జిల్లాకు చెందిన పార్టీ నేతలందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 
Back to Top