అక్ర‌మ భూముల డ‌బ్బుల‌తో రుణాలు మాఫీ చేయచ్చు


చిత్తూరు జిల్లా: ఏపీ నూత‌న రాజ‌ధానిలో తెలుగుదేశం నేత‌లు కొన్న భూముల డ‌బ్బుల‌తో రైతులు బంగారంపై తీసుకున్న రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయ‌వ‌చ్చ‌ని రాజంపేట వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ప్ర‌భుత్వ అవినీతి ప్ర‌శ్నిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. త్వ‌ర‌లో టీడీపీకి ప్ర‌జ‌లే త‌గిన బుద్ధి చెబుతార‌ని వ్యాఖ్యానించారు. భూదందా విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Back to Top