టీడీపీ అధికార దుర్వినియోగం

హైదరాబాద్ః అనంతపురంలో మరోసారి ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికను కూడా చంద్రబాబు ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించడం లేదని  వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. కనగానపల్లె ఎంపీపీ ఉపఎన్నికలో మంత్రి పరిటాల సునీత ప్రలోభాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అధికార దుర్వినియోగంతో ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకున్నారని విమర్శించారు. మంత్రి దేవినేని ఉమ నీటి పారుదల శాఖా మంత్రిగా గాకుండా అవినీతి పారుదల శాఖామంత్రిగా కొనసాగుతున్నారని నిప్పులు చరిగారు.

Back to Top