దళితుల అణిచివేతకు అధికార దుర్వినియోగం

గుడ్లవల్లేరు: పశ్చిమ గోదావరి జిల్లా గరిగపర్రు దళితుల అణిచివేతకు టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి తెగబడుతున్నారని వైయస్సార్‌ సీపీ జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు డోకాల కనకరత్నారావు ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దళిత కుటుంబాలను వెలివేసిన టీడీపీ నేతలను అరెస్టు చేయకుండా తాత్సారం చేసేందుకు స్థానిక ఎస్‌ఐ, తహసీల్దార్‌ను బాధ్యులుగా చేసి సస్పెండ్‌ చేయడం అన్యాయమన్నారు. ఆ ప్రాంతంలో సర్పంచి, ఎంపీపీ వంటి ప్రజాప్రతినిధులంతా టీడీపీ వారేనని గుర్తు చేశారు. ఇప్పటికైనా దళితుల వెలివేతకు కారకులైన టీడీపీ నేతల్ని అరెస్టులు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
Back to Top