రాష్ట్రంలో దాచుకో–దాచుకో పాలన

నెల్లూరు: ఆంధ్రప్రజలను ఆశలపల్లకీలో ఊరేగించి గద్దెనెక్కిన చంద్రబాబు మోసపోయామని మొసలికన్నీరు కారుస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. మోసపోయామని తెలుసుకోవడానికి నాలుగేళ్లు పట్టిందా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో దోచుకో–దాచుకో పాలన సాగుతోందని అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను పీడిచ్చి సంపాదిస్తున్న సొమ్మును... ఆయన కుమారుడు లోకేష్‌ దాచేస్తున్నాడని విమర్శించారు. ఆ డబ్బుతో ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు కాలర్‌ పట్టుకొని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబుతో మహానటుడు సినిమా తీయాలన్నారు. మహానటి సినిమాలో నటి సావిత్రి ఉన్న ఆస్తులన్నీ ప్రజలకు ధారదత్తం చేస్తే చంద్రబాబు రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించావో చూపిస్తారన్నారు. 
Back to Top