సభను తప్పుదోవ పట్టిస్తున్న బాబు

హైదరాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై చంద్రబాబు నాయుడు అవాస్తవాలు చెప్పి శాసన సభను తప్పుదోవ పట్టించారని  అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఉపాధి హామీలో లేబర్ కంపోనెంట్ 60 శాతం, అంతకన్నా ఎక్కువగా ఉండొచ్చు కానీ.. మెటీరియల్ కాంపోనెంట్ మాత్రం 40 శాతానికి మించొద్దని అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో లేబర్ కాంపోనెంట్ 97.54 శాతంగా ఉందని ఆయన వెల్లడించారు. సభలో ఉపాధి హామీపై చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడి సభను తప్పుదోవ పట్టించారన్నారు.

Back to Top