మిర్యాలగూడ మండలంలో నేడు మరో ప్రజాప్రస్థానం

మిర్యాలగూడ (నల్గొండ జిల్లా), 17 ఫిబ్రవరి 2013: శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం 69వ రోజు ఆదివారంనాడు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో కొనసాగుతుంది. మండలంలోని శ్రీనివాసనగర్‌, వెంకటాద్రిపాలెం, దుర్గానగర్‌ మీదుగా శ్రీమతి షర్మిల పాదయాత్ర మిర్యాలగూడ పట్టణానికి చేరుకుంటుంది. ఆదివారం రాత్రికి ఆమె దులగూడ శివారులో బస చేస్తారు.

ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు, దానికి వంత పాడుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగాను, కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు మేమున్నామంటూ భరోసానిచ్చేందుకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధేనేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రరెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల ఈ సుదీర్ఘ, చారిత్రక మరో ప్రజాప్రస్థానం నిర్వహిస్తున్నారు. 

Back to Top