మిర్యాలగూడలో నేడు షర్మిల బహిరంగ సభ

నల్గొండ, 16 ఫిబ్రవరి 2013: శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం 68వ రోజు పాదయాత్ర శనివారంనాడు త్రిపురారం మండల కేంద్రం, మిర్యాలగూ మండలాలలో కొనసాగుతుంది. అసమర్ధ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు, దానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు.

మిర్యాలగూడ మండలంలోని తుంగపాడు, శ్రీనివాసనగర్, వెంకటాద్రిపాలెం, దుర్గానగ‌ర్ మీదుగా ‌మిర్యాలగూడ పట్టణానికి చేరుకుంటుంది. అనంతరం పట్టణంలోని రాజీవ్‌చౌరస్తా వద్ద జరిగే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మిర్యాలగూడలోనే రాత్రికి శ్రీమతి షర్మిల బస చేస్తారు.
Back to Top