మిర్చి రైతులను కలిసిన షర్మిల

విజయవాడ, 17 ఏప్రిల్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల బుధవారంనాడు కృష్ణా జిల్లా గూడెం మాధవరంలో మిర్చి రైతులను కలిసి, వారితో మాట్లాడారు. మరో ప్రజాప్రస్థానం123వ రోజు పాదయాత్రను  ఆమె మాధవరంనుంచే ప్రారంభించారు. మిర్చి రైతులు శ్రీమతి షర్మిలకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మార్కెట్లో నాలుగు వేల రూపాయలు కూడా గిట్టుబాటు ధర రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులు లక్షల్లో అప్పులు చేసినట్లు తెలిపారు. విద్యుత్తు సక్రమంగా అందక దిగుబడి తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో వ్యవసాయం చేయలేకపోతున్నామని చెప్పారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ చనిపోయిన తర్వాత కౌలురైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందన్నారు.

Back to Top