చంద్రబాబు మైనార్టీల ద్రోహి

నెల్లూరు: ఏపీ సీఎం చంద్ర‌బాబు మైనార్టీల ద్రోహిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు సయ్యద్‌ హంజాహుస్సేన్ మండిప‌డ్డారు. నెల్లూరు నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనార్టీను అవమానించే విధంగా చంద్రబాబు ప్రవర్తన ఉందన్నారు. మంత్రి వర్గ విస్తరణలో కూడా మైనార్టీలకు చోటు కల్పించక పోవడం దారుణంగా ఉందన్నారు. మైనార్టీల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన బాబు ఈ విదంగా మైనార్టీలను మోసం చేయడం తగదన్నారు. చంద్రబాబు అక్రమ ఆస్తులకు బినామీలుగా ఉన్న వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఆరోపించారు. గతంలో బిజేపి నిందలు వేసి ఇప్పుడు బిజేపితో చెట్టాపట్టాల్‌ వేసుకుని చంద్రబాబు తిరుగుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనార్టీలు పార్టీ నుంచి భయటకు రావాలని పిలుపునిచ్చారు. రానున్న రోజులలో మైనార్టీలందరం ఏకతాటిపై వచ్చి చంద్రబాబుకు వ్యతిరేఖంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. రానున్న రోజులలో చంద్రబాబుకు బుద్ది చెపుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు ఎస్‌ఆర్‌ ఇంతియాజ్, ఎస్‌డి అబూబాకర్, ఫయాజ్‌ అహ్మద్, రఫి, హాజీ, మగ్దూమ్‌ మొమద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top