వైయస్ జగన్‌ సీఎం కావాలని మక్కాలో ప్రార్థనలు

రాయచోటి రూరల్‌: వైయస్‌ఆర్‌సీపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించి ఆ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మక్కాలో ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు రాయచోటిలోని పలువురు ముస్లింలు పేర్కొన్నారు. బుధవారం మక్కా నుంచి తెచ్చిన పవిత్ర జమ్‌జమ్‌ జలాలు, ఖర్జూరా ప్రసాదాలను ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైయస్‌ జగన్‌కు అందజేశారు. దేవుడి ఆశీస్సులతో ప్రజల అండదండలతో తప్పక ముఖ్యమంత్రి అవుతారని వారు వైయస్ జగన్‌కు తెలియజేశారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ ముస్లింలను ఆత్మీయంగా పలుకరించి, ఆలింగనం చేసుకుని వైయస్‌ఆర్‌సీపీకి ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు అందించాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లె ఎంపీపీ రెడ్డెయ్య , మైనార్టీ నాయకులు షామీర్, అహమ్మద్‌బాషా, మున్నా, షేక్‌ కపిల్, ఇర్షాద్, ఎస్‌ఎండీ రఫీక్‌ ,అనిఫ్, కరీముల్లా, మహబూబ్‌బాషా, మంజూర్‌వలి తదితరులు ఉన్నారు.

Back to Top