టీడీపీ ఎంపీని నిలదీసిన మహిళలు

టీడీపీ నేత సీఎం రమేశ్‌కు చుక్కెదురైంది.  వైయస్సార్‌ జిల్లా చాపాడులో ఇంటింటికీ టీడీపీ పేరుతో తిరుగుతున్న సీఎం రమేష్ కు మహిళలు చుక్కలు చూపించారు. ముస్లిం మైనార్టీ మహిళలు రమేష్ ను నిలదీశారు.   సిమెంట్‌ రోడ్డు వేశాకే వీధిలోకి రావాలని  అడ్డుకున్నారు. తమ వీధిలో సిమెంట్‌ రోడ్డు వేయాలని మూడేళ్లుగా విన్నవిస్తున్నా పట్టించుకోలేదని, ఇప్పుడొచ్చి మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం కాదని, చేసి చూపించాలని నిలదీయడంతో రమేష్ నీళ్లు నమిలాడు.  గట్టిగా అరవొద్దు.. చిన్నగా చెప్పండని సీఎం రమేశ్‌ వారించగా.. సిమెంట్‌ రోడ్డు వేస్తేనే వీధిలోకి అడుగుపెట్టాలని మహిళలు హెచ్చరించారు.

Back to Top