చాంద్ బాషా దిష్టిబొమ్మ దగ్ధం

అనంతపురంః క‌దిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా టీడీపీలో చేర‌డంతో క‌దిరిలో తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. చాంద్ బాషా టీడీపీలో చేరడాన్ని నిరసిస్తూ  మైనార్టీ సంఘాల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు క‌దిరిలో ఆందోళనకు దిగారు. చాంద్‌బాషాకు చెందిన లాడ్జి వ‌ద్ద ఆయ‌న దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు.  అధికార దాహంతో పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డుతున్న చాంద్ బాషాపై  ప‌లువురు మైనార్టీ సంఘాల నాయ‌కులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

డ‌బ్బుకు ఆశ‌ప‌డి ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను ప‌క్క‌న బెట్టి టీడీపీలో చేరడం దుర్మార్గమన్నారు.  క‌నీసం జ‌డ్పీటీసీగా కూడా గెల‌వ‌లేని చాంద్‌బాషాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి గెలిపించారని అన్నారు. వైఎస్సార్‌పై ఉన్న అభిమానం, వైఎస్ జ‌గ‌న్‌పై ఉన్న న‌మ్మ‌కంతోనే చాంద్‌బాషాను గెలిపించామ‌ని పలువురు పేర్కొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top