వైయస్‌ఆర్‌ హయాంలో మైనారీటీల అభివృద్ధి

భాకరాపేట: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే  మైనారీటీల అభివృద్ధి సాధ్యమైందని వైయస్‌ఆర్‌సీపీ మైనారీటీ సేవాదళ్‌ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు టీఎస్‌.రఫీ అన్నారు. చిన్నగొట్టిగల్లులో విలేకరులతో మాట్లాడుతూ మైనారీటీల సంక్షేమానికి, అభివృద్దికి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన సేవలతో చాలా నిరుపేదలైన ముస్లింలలో చిరునవ్వులు కనిపించాయన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలు కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు. చంద్రగిరి నియోజక వర్గంలో ముస్లిం మైనారీటీలకు సముచిత స్థానం కల్పించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 

Back to Top