రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీల ఆందోళనలు

టీడీపీ దుశ్చర్యపై రగిలిన ముస్లింలు

–విజయవాడలో ముస్లింల మౌన ప్రదర్శన
–ముస్లింల అభ్యున్నతికి తోడ్పడింది వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డే...
–మైనార్టీలపై చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ

రాజమహేంద్రవరంః టీడీపీ పాలనలో ఎప్పుడూ మైనార్టీలకు న్యాయం జరగలేదని తూర్పుగోదావరి జిల్లా  ముస్లిం మైనార్టీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. గుంటూరులో ముస్లిం యువకులపై టీడీపీ ప్రభుత్వం దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. టీడీపీ తన మేనిఫెస్టోలో ముస్లింలకు ఇచ్చిన హమీలన్నీ తుంగలో తొక్కి మోసం చేసిందన్నారు.  గత ఎన్నికల్లో మాటల గారడితో ముస్లింలను వంచనకు పాల్పడ్డారన్నారు.  నాలుగున్నర సంవత్సరాల అయిన తర్వాత టీడీపీకి ముస్లింలు గుర్తుకువచ్చారన్నారు.మైనార్టీల అభ్యున్నతికి తోడ్పడింది ఒక వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని,  ముస్లిం మైనార్టీల పట్ల చంద్రబాబు సవతి ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు.
విజయవాడః ముస్లింలపై ప్రభుత్వ దౌర్జన్యానికి నిరసనగా  ముస్లిం మైనార్టీలు ఆందోళన నిర్వహించారు. అరెస్టయిన తొమ్మిది మంది యువకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గాలిబ్‌ షాహిద్‌ దర్గా నుంచి స్వాతి థియేటర్‌ వరుకు మౌన ప్రదర్శన నిర్వహించారు.నాలుగేళ్ల పాటు బడ్జెట్‌లో చూపడమే తప్ప ఆచరణలో కనీసం 30శాతం నిధులను కూడా మైనార్టీల సంక్షేమానికి ఉపయోగించలేదన్నారు. 
Back to Top