మినిస్ట్రీస్‌తో బ్రదర్ అని‌ల్‌కు ఏం సంబంధం?

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలు అభిమానిస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్‌, టిడిపిలు కుట్రలు, కుతంత్రాలు పన్నాయని పార్టీ అధికార ప్రతినిధి, సిజిసి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. ఆ పార్టీలు ఇప్పుడు కొత్తగా శ్రీ జగన్‌ సోదరి శ్రీమతి షర్మిల భర్త బ్రదర్ అనిల్ ‌కుమా‌ర్‌పై ఒక పథకం ప్రకారం నిందలు, ఆరోపణలకు దిగుతున్నాయని ఆయన ఆదివారం ఇక్కడ దుయ్యబట్టారు.

‌శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అధికార, ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కొత్త డ్రామా మొదలుపెట్టాయని జూపూడి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో మినిస్ట్రీస్‌కు, బ్రదర్ అని‌ల్‌కు ఎలాంటి సంబంధమూ లేకపోయినా కావాలనే ఒక పథకం ప్రకారం అప్రతిష్టపాలు చేయాలని ఆ పార్టీలు కుట్ర పన్నాయని ఆయన పేర్కొన్నారు. హెచ్ఎం‌డిఎ అధీనంలో ఉన్న స్థలాన్ని మినిస్ట్రీస్‌కు కేటాయించారని, దీనితో ఎలాంటి సంబంధం లేని బ్రదర్ అని‌ల్‌కు ముడిపెట్టటమే కాకుండా స్థలం కబ్జా చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఖండించారు.

శ్రీమతి షర్మిల తన పాదయాత్రలో అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంతో బ్రదర్ అని‌ల్‌ చేసుకున్న తెలుగుదేశం కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుతున్నందునే ఆమె భర్తపై ఇలాంటి నీచమైన ఆరోపణలు చేస్తున్నారని‌ జూపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Back to Top