రుణమాఫీపై మంత్రిని నిలదీసిన మహిళలు

చిత్తూరుః జిల్లాలోని ఏర్పేడుకు వచ్చిన మంత్రి గోపాల కృష్ణారెడ్డిని డ్వాక్రామహిళలు ఎన్నికల హామీలపై నిలదీశారు. కాట్రకాయలగుంటలో
జరిగిన సమావేశంలో బొజ్జల మాట్లాడుతుండగా..డ్వాక్రా రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పాలని నిలదీశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంతవరకు పైసా కూడా మాఫీ చేయలేదని మండిపడ్డారు. మరికొన్ని గ్రామాల్లో ప్రజలు పెన్షన్ ఎందుకు మంజూరు చేయడం లేదని మంత్రిని కడిగిపారేశారు.

Back to Top