అవును..కొన్నాను..అయితే ఏంట‌ట..!


హైద‌రాబాద్‌) ఈ మాట‌లు చ‌దివితే ఎవ‌రైనా బాగా రుబాబు చేసే వ్య‌క్తి మాట్లాడిన‌ట్లుగా ఉంది కదా. అక్ష‌రాలా ఈ ప‌దాలు ప‌ల‌క‌లేదు కానీ వ్య‌వ‌సాయ‌మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు దాదాపు ఇదే అర్థం స్ఫురించేలా అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీ లో వైఎస్సార్సీపీ ప్ర‌వేశ పెట్టిన వాయిదా తీర్మానం మీద చ‌ర్చ‌లో ఆయ‌న పాల్గొన్నారు. భార్య పేరు మీద అగ్రి గోల్డ్ ఆస్తుల్ని కొనుగోలు చేసిన‌ట్లు ఆయ‌న అంగీక‌రించారు. అయితే న్యాయ స‌ల‌హా తీసుకొని కొనుగోలు చేశామ‌ని, ఇందులో అగ్రి గోల్డ్ కంపెనీల‌కు సంబంధం లేద‌ని చెప్పారు. అయితే ఈ అంశంపై ప‌త్రిక‌లు, ఛానెల్స్ లో వార్త‌లు రాయ‌టం మీద ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొనుగోలు చేయ‌టం క‌రెక్ట్ అంటూ, దాని మీద వార్త‌లు రాయ‌టం త‌ప్పు అంటూ ఫైర్ అవ‌టం విశేషం. 
Back to Top