ప్రత్తిపాటి ఖాతాలో ‘అసైన్డు’ భూములుకొనుగోలు 196 ఎకరాలు

చెల్లించినది
రూ.
39 కోట్లు

ప్రస్తుత
విలువ
784 కోట్లు రాజధాని ప్రాంతంలో బినామీలను
అడ్డుపెట్టుకుని నిరుపేద దళిత రైతులకు చెందిన అసైన్డు భూములను కొల్లగొట్టడంలో
వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దూకుడు చూపారు. అసైన్డు భూములను
ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటుందని.. భూ సమీకరణ కింద ప్యాకేజీ ఇవ్వదని దళిత రైతులను బెదిరించారు.
ఆందోళనలో మునిగిపోయిన దళిత రైతుల నుంచి ఎకరం రూ.కనిష్ఠంగా రూ.10 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.20 లక్షల
చొప్పున 196.4 ఎకరాల భూమిని హస్తగతం చేసుకున్నారు. చట్టంలో లోపాలను ఆధారంగా
చేసుకుని కొన్ని భూములు బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్, కొన్నింటికి పవర్ ఆఫ్  అటార్నీ
చేయించుకున్నారు.

 

ప్రతి అడుగులోనూ ముందుచూపు..

రాజధాని భూసమీకరణ కార్యక్రమం ప్రారంభం నుంచి మంత్రి
ప్రత్తిపాటి భూముల కొనుగోలుపై దృష్టిని పెట్టారు. భూ సమీకరణను పర్యవేక్షిస్తూ
రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆ సమయంలో గ్రామాల్లోని సర్పంచ్‌లు, టీడీపీ నేతలు, కార్యకర్తలతో
సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. వారి ద్వారా గ్రామాల్లోని అసైన్ఢ్ భూములు
కలిగిన కుటుంబాల వివరాలు, వారి
ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు. నిరుపేద ఎస్సీలను మోసం చేసి ఎకరా భూమి కేవలం
రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల
ధరకే... తనతో సన్నిహిత సంబంధాలు కలిగిన సర్పంచులు, ముఖ్యనేతల
పేరు మీద   అసైన్డ్, అటవీ
భూములను కొనుగోలు చేశారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామానికి చెందిన సర్వే
నంబర్లు 293, 294, 295, 296, 379, మందడం గ్రామంలోని 454, ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన 115, 94 సర్వే నంబర్లు, రాయపూడి
గ్రామానికి చెందిన 377, 386 తదితర
సర్వే నంబర్లలోని 96.4 ఎకరాల
అసైన్డు భూములను గూడూరు సురేశ్ పేరుతో రిజిస్ట్రేషన్, జీపీ చేయించుకున్నారు. మరో బినామీ వెనిగళ్ల రాజారెడ్డి, తన భార్య వెంకాయమ్మ పేర్లపై మరో వంద ఎకరాలకుపైగా అసైన్డు
భూమిని జీపీ చేయించుకున్నారు.

 

ఎవరీ గుమ్మడి సురేశ్?

విజయవాడ బందరు రోడ్డులో ఓ ప్రముఖ వస్త్ర దుకాణం
యజమాని గుమ్మడి సురేశ్‌తో మంత్రి ప్రత్తిపాటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
మంత్రితో కలిసి ఆయన పత్తి వ్యాపారం కూడా  చేస్తూ
నాలుగు కాసులు వెనకేసుకున్నారు. అయితే  నాలుగేళ్ల
క్రితం వరకూ ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న సురేశ్‌కు 96.4 ఎకరాల భూమిని కొనుగోలు చేసే తాహతు లేదు. పైగా కొనుగోలు చేసిన
అసైన్డు భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం సురేశ్‌కు సాధ్యం కాదు. మంత్రి
ప్రత్తిపాటి పుల్లారావు ఒత్తిడి వల్లే ఆ భూములను గుమ్మడి సురేశ్ పేరుతో రిజిస్ట్రేషన్
చేయించారని సమాచారం.

 

Back to Top