మంత్రి నారాయ‌ణ రాజీనామాకు సిద్ధ‌మా?నెల్లూరు:  “నారాయ‌ణ కాలేజీలో ఒక్క అడుగు కాలువ ఆక్ర‌మ‌ణ‌కు
గురికాలేదా... ఆక్రమణ విషయం నిరూపిస్తే రాజీనామా చేస్తారా.. అక్ర‌మ‌ణ‌కు గురి
కాలేద‌ని నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా” అని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు న‌గ‌ర
ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్ మంత్రి నారాయ‌ణ‌కు స‌వాల్ విసిరారు. కాలువ అక్ర‌మ‌ణ‌పై
క‌లెక్ట‌ర్‌తో పాటు హైలెవ‌ల్ క‌మిటీని పిలిచి నిజ‌నిర్ధార‌ణ చేయాల‌ని అనిల్‌కుమార్
డిమాండ్ చేశారు. నెల్లూరు లో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. మంత్రిని
ఉన్మాదిగా సంబోధించిన వ్యాఖ్య‌కు క‌ట్టుబ‌డి ఉంటానన్నారు. న‌గ‌రంలో 500 కుటుంబాల సంక్షేమాన్ని ప‌ట్టించుకోకుండా
ఉన్న‌ట్టుండి వారి ఇళ్ల‌ను పోలీస్ బ‌ల‌గాల మోహ‌రింపుతో తొల‌గించాల‌నుకోవ‌డం
ఉన్మాదం కాదా అని అనిల్ ప్ర‌శ్నించారు. టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు ర‌విచంద్ర స‌భ్య‌త
నేర్చుకోవాలంటూ మాట్లాడ‌టం సిగ్గు చేట‌న్నారు. మంత్రి నారాయ‌ణ రాజీనామా చేయ‌ని ప‌క్షంలో
రాజీనామాకు ర‌విచంద్ర సిద్ధ‌మేనా అని నిల‌దీశారు. మ‌న్సూర్‌న‌గ‌ర్ నుంచి స‌ర్వేప‌ల్లి
కాలువ‌లో ఏ మేర‌కు కాలువ అక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గిస్తారో తెలిపి, అంద‌రి ఆమోదంతో ప‌నులు చేప‌ట్టాల‌ని హిత‌వు ప‌లికారు. 

 

Back to Top