మంత్రి కామినేని శ్రీనివాస్‌ను తొలగించాలి

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : నాలుగైదు రోజులుగా పెద్దాసుపత్రిలోని కొన్ని వార్డులకు కరెంట్‌ సక్రమంగా సరఫరా కాక అంధకారంలో ఉంచడంపై వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, బాలింతలు ఉండే వార్డులకు కరెంట్‌ కరెంట్‌ లేకపోవడంతో తీవ్ర అవస్థలుపడుతున్నారని శనివారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్‌ దృష్టికి తీసుకెళ్లిన పరిష్కరించలేకపోయాడని విమర్శించారు. దీంతో వెంటనే అతన్ని తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పెద్దాసుపత్రిలో కరెంట్‌ లేక రోగులు పడుతున్నా అవస్థలను నాలుగురోజుల క్రితం కర్నూలు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబునాయుడు దృషికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోవడంతో రోగుల బాధలు వర్ణనాతీతమన్నారు. వెంటనే కరెంట్‌ను సక్రమంగా సరఫరా చేయకపోతే వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళలు చేపడుతామని ఆయనహెచ్చరించారు,

Back to Top