మంత్రి కామినేనిని బర్తరఫ్‌ చేయాలి

– గరగపర్రులో గ్రామ బహిష్కరణ చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలి
– వైయస్‌ఆర్‌సీపీ నాయకుల డిమాండ్‌
కడప కార్పొరేషన్: పశ్చిమ గోదావరి జిల్లా టి. రామవరం మండలంలో విషజ్వరాలకు 16 మంది గిరిజనులు మరణించిన ఘటనకు రాష్ట్ర వైద్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్‌ బాధ్యత వహించాలని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంపీ సురేష్, కార్పొరేటర్లు కె. బాబు, చైతన్య అన్నారు. ప్రభుత్వం అయన్ను వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. విషజ్వరాలతో దళిత, గిరిజనులు చనిపోతే కలుషిత నీరు తాగి చనిపోయారని మంత్రి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా అని వారు సూటిగా ప్రశ్నించారు. అలాగే గరగపర్రులో దళితులను గ్రామ బహిష్కరణ చేసిన అగ్రవర్ణాలపై కేసులు నమోదు చేసి, అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దళితులపై ముఖ్యమంత్రికి ఉన్న వివక్ష అడుగడునా బయటపడుతోందని ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మహిమలూరి వెంకటేష్, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.
వివరించారు.
Back to Top