దళితులపై మంత్రి వ్యాఖ్యలు అనుచితం

గుమ్మఘట్ట: దళితులను ఉద్దేశించి మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వైయస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీసెల్‌ కార్యదర్శి బీటీపీ గోవిందు, దళిత ముఖ్య నాయకుడు బేలోడు రామాంజినేయులు డిమాండ్‌ చేశారు. గుమ్మఘట్ట మండలంలోని బీటీపీ కి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు దళిత ఏకాంత సొదరి వివాహానికి గురువారం సహకార సంఘం అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, వైయస్సార్‌సీపీ బీసీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌టీ సిద్దప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి మాదవరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి పైతోట సంజీవ లు పాల్గొని వధు, వరుడిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశబ్ధాలు దాటినా దళితుల పై వివక్ష కొనసాగడం హాస్యస్పదంగా ఉందన్నారు. బా«ధ్యత గల మంత్రి పదవిలోఉన్న వ్యక్తి ఇలా కించపరిచే వ్యాఖ్యలు చేయడం బాధకరమన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే తక్షణం మంత్రి ఆదినారాయణరెడ్డిని బర్త్‌రప్‌ చేయాలని డిమాండ్‌. లేకుంటే దళిత ద్రోహులుగా అభివర్ణించాల్సి వస్తోందని, వచ్చే ఎన్నికల్లో దళితుల సత్తా ఎంటో టీడీపీకి రుచి చూపిచాల్సి వస్తోందన్నారు.

నంద్యాల నుంచే టీడీపీ పథనం..
నంద్యాల ఉప ఎన్నిక నుంచే టీడీపీ పథనం ఖాయమని, భవిష్యత్తులో ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం నెర్పుతారని బీసీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌టీ సిద్దప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి మాదవరెడ్డిలు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమన్నారు. ఎన్నికుయుక్తులు పన్నినా విజయం వైయస్సార్‌సీపీనే వరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీటీపీ వైయస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
Back to Top