మంత్రి యాక్షన్..పోలీసుల ఓవరాక్షన్

పశ్చిమగోదావరి జిల్లాః ఫ్లెక్సీ వివాదంలో తాడేపల్లిగూడెం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైయస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ను పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐను బండ బూతులు తిట్టిన మంత్రి మాణిక్యాలరావును అరెస్ట్ చేయకుండా సత్యనారాయణను అరెస్ట్ చేయడం పట్ల మండిపడ్డారు. మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. అరెస్ట్ ను నిరసిస్తూ పీఎస్ వద్ద వైయస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 

తాజా ఫోటోలు

Back to Top