రెండో రోజు మైక్ కట్ లు


హైదరాబాద్) శాసనసభలో రెండో
రోజు ప్రజాస్వామ్యానికి పాతర వేసే ధోరణి కొనసాగింది. ప్రధాన ప్రతిపక్షం
వైఎస్సార్సీపీ ప్రజలకు ఎంతో ముఖ్యమైన కాల్ మనీ సెక్సు రాకెట్ అంశం మీద వాయిదా
తీర్మానం ఇచ్చారు. దీని అవసరం ఏమిటో చెప్పేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్
ప్రయత్నించారు. వెంటనే మైక్ కట్ చేశారు. సభను పదే పదే అడ్డుకొంటున్నారని
ప్రతిపక్షం మీద దుమ్ము పోసేందుకు ప్రయత్నించారు. మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు
ఉపన్యాసాలు ఇచ్చేందుకు మాత్రం అనుమతి ఇచ్చారు. తర్వాత ప్రతిపక్షనేత వైఎస్ జగన్
మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ ప్రభుత్వం ఆడుతున్న దొంగాటను సభ ద్రష్టికి తెస్తుండగానే
మళ్లీ మైక్ కట్ చేశారు. అనంతరం మైక్ కట్ చేశారు. 

Back to Top