టీడీపీలో చేరడం సిగ్గుమాలిన చర్య

వైఎస్సార్ జిల్లాః జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి  టీడీపీలో చేరడం సిగ్గుమాలిన చర్య అని... ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే శాసన సభ సభ్యత్వానికి రాజీనామ చేసి టీడీపీ బీఫాం పై గెలవాలని వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సవాల్ విసిరారు. తల్లి లాంటి పార్టీని దూషించడం తగదని ఆదినారాయణరెడ్డికి హితవు పలికారు. 

వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు సబ్‌జైలులో ఉన్న ...ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి బావమరిది బంగారిరెడ్డిని ఆయన ఈ రోజు కలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.... టీడీపీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. 

Back to Top