ప్రతిపక్షం గొంతు నొక్కుతూ పదే పదే మైక్ కట్

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కోసం గళం విప్పిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గొంతును అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రభుత్వం మరోసారి నొక్కిపెట్టే ప్రయత్నం చేసింది. హోదాపై చర్చ చేపట్టాలంటూ సర్కారును నిలదీస్తున్న ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మైక్‌ను స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ పదే పదే కట్‌ చేశారు. పైగా మైక్‌ను మిస్‌యూజ్‌ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మైక్ కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా ప్రత్యేక హోదాపై చర్చించాలంటూ వైయస్ఆర్ సీపీ సభను స్తంభింపచేసిన విషయం తెలిసిందే.

Back to Top