హైదరాబాద్‌ మెట్రోకు పునాది పడింది వైయస్‌ఆర్‌ హయాంలోనే


– హైదరాబాద్‌ సిటీజనులకు ట్రాఫిక్‌ పద్మవ్యూహం నుంచి ఉపశమనం కల్పించేందుకు మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి మెట్రో రైలుకు శ్రీకారం చుట్టారు. 

– వైయస్‌ఆర్‌ ఆహ్వానం మేరకు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ అధికారులు 2005–07 మధ్యకాలంలో నగరంలో పర్యటించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేశారు. 

– మొదటి దశలో మూడు కారిడార్లలో మొత్తం 73 కిమీ మేర ప్రాజెక్టుకు రూపలక్పన జరిగింది. ఎల్బీనగర్‌– మియాపూర్‌(29కిమీ), జేబీఎస్‌–ఫలక్‌నుమా(15కిమీ), నాగోలు– రాయదుర్గం(29 కిమీ) మార్గాల్లో పనులు చేయాలని నిర్ణయించారు.
 
-ఇందుకు సంబంధించిన అన్ని క్లియరెన్సులను కూడా వైయస్ ఆర్ ప్రత్యేక చొరవ చూపించి  త్వరితగతిన తెప్పించారు.
– 2008 జూలైలో మెట్రో రైల్ కార్యాలయం ప్రారంభించిన అనంతరం , టెండర్ల ప్రక్రియ చేపట్టారు.

- పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP mode) ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు.
– మైటాస్  సంస్థ టెండర్లు దక్కించుకుంది. ఆ తరువత ఈ సంస్థ కార్పొరేట్‌ మోసాల కేసులో చిక్కుకోవడంతో వైయస్‌ సర్కారు 2009 తొలినాళ్లలో టెండర్లు రద్దు చేసింది.

– తిరిగి పారదర్శక విధానంలో గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించింది. ఇందులో ఎల్‌అండ్‌టీ సంస్థ టెండర్లు దక్కించుకుంది. 

ఎంతో దార్శనికతతో నాటిముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ప్రాజెక్టు డిజైన్ లకు  అనుగుణంగానే హైదరాబాద్ మెట్రో రైలు పట్టాలకు ఎక్కుతోంది
Back to Top