దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత ద్రోహి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. ఎమ్మెల్యే ఐజయ్యను అవమానించిన చంద్రబాబు దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నందికోట్కూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేను మాట్లాడనివ్వకపోవడం దుర్మార్గమన్నారు. మైక్‌ కట్‌ చేసి నియోజకవర్గ ప్రజల ముందు ఐజయ్యను అవమానపరిచాడని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

Back to Top