కళ్లు లేని కబోదుల్లా టీడీపీ దళిత ఎమ్మెల్యేలు

గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ చట్టాలను చుట్టాలుగా వాడుకుంటున్నా టీడీపీ దళిత, గిరిజన ఎమ్మెల్యేలు కళ్లులేని కబోదుల్లా మిగిలిపోతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో దళిత, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతుందని మండిపడ్డారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తూ చంద్రబాబు నియంతపాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
Back to Top