దళితులను అవమానిస్తే తగిన బుద్ధి చెబుతాం

హైదరాబాద్:
వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున చంద్రబాబుపై
విరుచుకుపడ్డారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలను దుర్వినియోగం చేస్తూ ...చంద్రబాబు
దళితుల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. తీరు మార్చుకోకపోతే తగిన
బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని దివంగత
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే అవలంభించారని నాగార్జున
కొనియాడారు. 

హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో
ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈనెల 26న గుంటూరులో రాజ్యాంగ
ఆమోద దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు. దళితులను అవమానపరుస్తున్న తీరు
మార్చుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.  
Back to Top