చంద్రబాబు 15 మంది దొంగలు..!

దీక్షపై దిగజారి విమర్శలు..!
రాబోయే తరాలకు దిక్సూచి..!

గుంటూరుః వైఎస్సార్సీపీ నేత మేరుగ నాగార్జున చంద్రబాబు ఆయన భజన బ్యాచ్ పై నిప్పులు చెరిగారు. ప్రత్యేకహోదా కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వైఎస్ జగన్ పై విమర్శలు చేసే అర్హత టీడీపీ నేతలకు లేదని హితవు పలికారు. విభజన చట్టం అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు. అన్నం పెట్టాల్సిన వాళ్లే చేతులెత్తేశారని , అలీబాబా 40 దొంగల్లాగా చంద్రబాబు 15మంది దొంగల్ని ప్రొత్సహిస్తూ వస్తున్నారని దుయ్యబట్టారు. కేసుల్లో ఇరుక్కొని ధనదాహంతో ఇసుక, మట్టి అమ్ముకుంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

జన ఆశీర్వాదం..!
వైఎస్ జగన్ ను ఆశీర్వదించేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారని నాగార్జున తెలిపారు. రాబోయే తరాలకు వైఎస్ జగన్ దీక్ష దిక్సూచీ లాంటిదన్నారు. భారతదేశ చరిత్రలోనే ఏపీలో రానున్న రోజుల్లో వైఎస్ జగన్ ఓ కలికితురాయి అవుతాడని పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం వైఎస్ జగన్ చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాల్సింది పోయి దిగజారి విమర్శలు చేస్తున్నారని పచ్చనేతలపై మండిపడ్డారు. భారతదేశంలోనే దళితులకు మేలు చేసిన నాయకుడు ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమేనని ఈసందర్భంగా గుర్తు చేశారు. 
 
జనం మాటే జగన్ మాట..!
ప్రత్యేకహోదా సంజీవనా అని ముఖ్యమంత్రి అంటాడు. ఇంకొకయాన ఏమీ తెలియదంటాడు. మరొకాయన జిందాతెరిస్మాత్ అని ఇష్టమొచ్చినట్లు  మాట్లాడుతాడుతున్నారని మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, టీడీపీలు చెప్పాయన్నారు.  అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని నిప్పులు చెరిగారు. ప్రత్యేకహోదా ఇవ్వాలని చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఒకే మాట అని రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నదే ఆయన తపని అని స్పష్టం చేశారు.  
Back to Top