బండారు నోరు అదుపులో పెట్టుకో..విజయవాడ: పెందుర్తి మండలం జె్రరిపోతులపాలెంలో దళిత మహిళలను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున అన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. విజయవాడలో మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. సినిమా హాల్లో టికెట్లు అమ్ముకున్న వ్యక్తికి వైయస్‌ఆర్‌ సీపీ నేతలను విమర్శించే స్థాయి లేదన్నారు. బండారు అరాచకాలపై బహిరంగ చర్చకు మా పార్టీ మండలాధ్యక్షుడు చాలన్నారు. దళిత మహిళలపై దాడి ఘటనలో బండారు సత్యనారాయణ, ఆయన కుమారుడు ప్రధాన సూత్రధారులన్నారు. దీనిపై ప్రైవేటు కేసు పెడతామని హెచ్చరించారు. 
Back to Top